హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వంపై రాములమ్మ శివాలు, పోలీసులపై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించి సామాన్య జనంపై లాఠీఛార్జీ చేశారని, దానికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి గురువారం డిమాండ్ చేశారు. బాధిత మహిళలతో విజయశాంతి మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమం ప్రజల కోసమని చెబుతూ ప్రభుత్వం అదే ప్రజలను హింసిస్తూ, అరెస్టులు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.

మెదక్‌ జిల్లా దుబ్బాకలో జరగిన రచ్చబండ కార్యక్రమంలో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించి మహిళలను కూడా చితకగొట్టారని ఆరోపించారు. హోంమంత్రి కూడా మహిళే అని ఆమె తమ సమస్యను అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
TRS Senior leader, Medak MP Vijayashanthi demanded CM Kiran Kumar Reddy and Home Minister Sabitha Reddy to take action against Police, who slammed woman in Rachabanda, held at Dubbaka of Medak district. On thursday Followed by victims, Vijayashanthi made complaint in HRC against police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X