చిరంజీవి తెలంగాణలోనే కాదు సీమాంధ్రలోనూ పొడిచేసేదేమీ లేదు: కోమటిరెడ్డి

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై చిరంజీవి ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వైయస్సార్ హయాంలో అవినీతి జరిగిందని చిరంజీవి విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. చిరంజీవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్సార్‌పై విమర్శలు చేస్తే సహించబోమని ఆయన చిరంజీవిని హెచ్చరించారు. రచ్చబండ కార్యక్రమంలో తాము వైయస్సార్ ఫొటో పెట్టుకుంటున్నామని, ఇటువంటి స్థితిలో చిరంజీవి విమర్శలు సరైనవి కావని ఆయన అన్నారు. మంచి నాయకుడిని కోల్పోయామని తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్సార్ మరణించినప్పుడు అన్నారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications