జూ. ఎన్టీఆర్‌కూ జనాలు వచ్చారు, జగన్ స్థితి కూడా అంతే: విహెచ్

V Hanumantha Rao
విశాఖపట్నం: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సభలకు కూడా పెద్ద యెత్తున ప్రజలు వచ్చారని, కానీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడలేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. ప్రజలు వచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటేనని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పరిస్థితి కూడా అంతేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు.

అవిశ్వాస తీర్మానం విషయంలో కెసిఆర్ ఫలితం సాధించలేరని ఆయన అన్నారు. డెడ్‌లైన్లు, రాజీనామాలతో కెసిఆర్ సాధించిందేమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాష్ట్రంలో ఏం చేసినా వ్యర్థమేనని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలోనే అని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెరాస ఉండదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+