హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్‌కు అవిశ్వాసం పెట్టేందుకు బలం లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sridharbabu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అవిశ్వాసం పెట్టే బలం లేదని మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం విలేకరులతో అన్నారు. అవిశ్వాసం పెట్టడానికి కావాల్సిన బలమే లేని టిఆర్ఎస్ అవిశ్వాసం ఎలా పెడుతుందని ప్రశ్నించారు. ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే ఉన్నాయని, అవిశ్వాసానికి దాదాపు 30 మంది కావాలని చెప్ప్రారు. మెజార్జీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ అవిశ్వాసం గురించి ఆలోచించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రాజకీయ ప్రక్రియతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్రం తెలంగాణ తప్పకుండా ప్రకటిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. నేను కూడా తెలంగాణవాదినేనని, తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నామని చెప్పారు. అయితే తెలంగాణతో పోరు అంటూ అభివృద్ధిని అడ్డుకోవడం మాత్రం సమంజసం కాదన్నారు. అందరూ తెలంగాణ కోసం ఉద్యమించాల్సిందేనని, అదే సమయంలో అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. ఫీజు రీయింబర్సుమెంట్‌పై విపక్షాలది రాజకీయం అన్నారు. విద్యార్థులకు వెంటనే ఫీజులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఇందుకోసం 16వ తేదిన సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహాయ నిరాకరణతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందన్నారు.

English summary
Minister Sridharbabu said that TRS has no chance to propose non confidential motion against government. He suggest 
 
 TRS to think about this, If have majority. He aslo condemned oppostiones agitations on fees reimbursements. He said 
 
 Congress has stand for Telangana. He said we will force on Central for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X