కుంభరాశి, మీనరాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లోకుంభ రాశి, మీన రాశి వారి మే నెల జాతక ఫలం ఎలా ఉందో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫలితాలు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ నెల చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఆర్థికంగా, వృత్తిపరంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మే 15వ తేదీ నుండి అదృష్టం బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ ఆలోచన ఈ నెలలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ, మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు మే 15 లోపు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. శని ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కలగవచ్చు.

Horoscope Predictions and results for these two signs Aquarius and Pisces for may month

ధ్యానం, యోగా చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెళ్లి కానివారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కోసం ఎదురుచూసే వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం, శనివారం శివాలయంలో రుద్రాభిషేకం చేయడం వల్ల ఇబ్బందులు తొలగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మరికొన్ని విషయాల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. మే 10వ తేదీ తర్వాత కుజుడి ప్రభావం వల్ల ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. కార్యాలయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే శని లగ్నంలో ఉన్నందున కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడవద్దు. రెండో సగ భాగంలో వ్యాపారం పుంజుకుంటుంది.

విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లి ఆరోగ్యం పట్ల ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు చిన్నపాటి కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి బయటి ఆహారానికి దూరంగా ఉండండి. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. బంధువులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం, శనివారం రోజు పేదలకు పాలు లేదా పంచదార దానం చేయడం శుభప్రదం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+