హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్లమెంటులో బైఠాయిస్తా, తెలంగాణపై తాడోపేడో తేల్చుకుంటా: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని, పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తాను స్పీకర్‌ పోడియం వద్ద బైఠాయిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఈనెల 17 నుంచి పెన్‌డౌన్‌ ద్వారా సహాయ నిరాకరణలో పాల్గొనడానికి సిద్ధమయ్యారని, వారికి తెరాస సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆయన ఆదివారం తెలిపారు. గాంధీ చూపిన బాటలోనే సహాయ నిరాకరణ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాలనను పూర్తిగా స్తంభింపజేస్తామని, ఉద్యోగులను ఎస్మా, మీసా చట్టాల పేరుతో ప్రభుత్వం వేధించి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రైల్వే తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా పెన్‌డౌన్‌ చేయడానికి ముందుకు వచ్చారన్నారు. తెలంగాణ మొత్తం ఐక్యశక్తిగా కదిలివస్తుందన్నారు. స్వాతంత్య్ర సంగ్రామం రెండు తరాల్లో జరిగిందని, 1857లో విఫలమైనా 1947లో సాధించుకున్నామన్నారు.

ఆదివారం 75 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సహాయ నిరాకరణకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఉద్యోగులకు సంఘీభావంగా తెరాస తరఫున గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని కేసీఆర్‌ చెప్పారు. తమ పార్టీలో ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ప్రతీ జిల్లాలో ఈ టాస్క్‌ఫోర్స్‌ ఉద్యోగులకు సహకరిస్తుందని పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే, అణచివేయాలని చూస్తూ తాను ఊరుకోబోనని, మరోసారి దీక్ష చేపడతానని, ఈసారి చుట్టూ 50 వేల మందిని ఏర్పాటు చేసుకొని దీక్ష చేస్తానని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. సహాయ నిరాకరణతో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగివస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.

English summary
TRS president KCR said, he will stage dharna before speaker in Parliament during budget session, demanding statehood for Telangana. He extended his support to the Telangana Government staff, who are taking up civil disobedience from 16th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X