రాహత్ విడుదలకు పాక్ విజ్ఞప్తి, విదేశీ కరెన్సీపై భారత్‌లో అరెస్టు

Rahat Fateh Ali Khan
ఇస్లామాబాద్: భారత్‌లోని ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో అరెస్టయన ప్రముఖ గాయకుడు రాహత్ ఫతే అలీని విడిపించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ ఇస్లామాబాదులోని భారత హై కమీషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. విచారణ సందర్భంగా రాహత్ పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించకుండా చూడాలని ఆయన కోరారు. ఆరు గంటల పాటు విచారణ చేసిన తర్వాత రాహత్‌ను భారత పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.

ప్రముఖ పాకిస్థానీ గాయకుడు రాహత్‌ ఫతే అలీఖాన్‌ని రెవెన్యూ నిఘా అధికారులు ఆదివారం నిర్బంధించారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున విదేశీ నగదును తీసుకెళుతుండటంపై ఆయనను ప్రశ్నించారు. ''రాహత్‌ ఆదివారం సాయంత్రం కరాచీ నుంచి వచ్చిన ఓ విమానంలో దిగారు. ఆయన తాను తీసుకెళుతున్న విదేశీ నగదును వలసల విభాగం అధికారులకు చూపలేదు. అందుకే నిర్బంధించాం'' అని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+