హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌పై డిఎల్ ఆరోపణలు జగన్‌కే లాభం: కేబినెట్ సమావేశంలో వట్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vatti Vasanth Kumar
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, శంకర్‌రావు చేస్తున్న విమర్శలపై సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఘాటుఘాటుగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సోమవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా వైయస్‌పై విమర్శలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. డిఎల్, శంకర్‌రావు నిత్యం వైయస్‌పై విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని మరో మంత్రి వట్టి వసంత్‌కుమార్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. వైయస్‌పై విమర్శలు చేస్తే మాజీ పార్లమంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందే అవకాశముందని వారు సిఎంకు సూచించినట్టు తెలుస్తోంది.

వట్టి ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి డిఎల్, శంకర్‌రావులను వైయస్‌పై విమర్శలు వద్దని సూచించినట్టుగా తెలుస్తోంది. కాగా రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని సమావేశంలో సిఎం చెప్పారు. తెలంగాణలో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మంత్రులను సిఎం అభినందించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్సుపై ముఖ్యమంత్రి, మంత్రి బొత్స సత్యనారాయణకు మధ్య కాస్త చర్చ జరిగింది. ఫీజుల విషయంలో ఇచ్చిన మాట తప్పకూడదని సిఎంకు బొత్స సూచించినట్టుగా తెలుస్తోంది.

English summary
Vatti Vasanth Kumar expressed anguished at DL Ravindra Reddy and Shankar Rao comments against YSR in Cabinet meeting on monday. He complaint CM Kiran Kumar Reddy on this issue. He warned them Jagan will gain with their comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X