హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను కిరణ్ ఆంధ్రలో ప్రవేశించాడా, లొంగుబాటుకు యత్నిస్తున్నాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించినట్లు వార్తాకథనాలు వచ్చాయి. పోలీసులకు లొంగిపోవడానికి అతను ప్రయత్నిస్తున్నట్లు కూడా ఆ వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి. అన్ని వైపులా దారులు మూసుకుపోవడంతో భాను లొంగిపోతాడని హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. చాలా రోజులు గుర్గావ్‌లో భాను తలదాచుకున్నాడు. ఆయన గన్‌మెన్ మన్మోహన్ అరెస్టయిన తర్వాత భానుకు భాషా సమస్య ఎదురైనట్లు చెబుతున్నారు. దీంతో అతడు రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నట్లు వార్తకథనాల సారాంశం.

కుటుంబ సభ్యులు, బంధువులు, భాను సహచరుల కదలికలపై, ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. ఏపీతో పాటు బెంగళూరు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో భాను తలదాచుకునే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్థానికులనే పోలీసులు ఇన్‌ఫార్మర్లుగా పెట్టుకున్నారు. భాను గన్‌మెన్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. అతడి వద్ద ఉన్న డబ్బు కూడా అయిపోయినట్టేనని పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. పోలీసుల నిఘా పెరగడంలో సెల్‌ఫోన్‌నూ వినియోగించడం లేదని తెలుస్తోంది. ఆయన గన్‌మెన్ మన్మోహన్ అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఒకే ఒక్కసారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. దాని ద్వారానే భాను, మన్మోహన్ తలదాచుకున్న స్థావరాన్ని పోలీసులు పసిగట్టగలిగారు. మన్మోహన్ చిక్కినా భాను మాత్రం తప్పించుకున్నాడు. ఈ స్థితిలో భాను కొద్ది రోజుల కిందట ఏపీలో అడుగుపెట్టి ఉంటాడని భావిస్తున్నట్టు ఓ దినపత్రిక రాసింది. సూరి వర్గీయులు కూడా భాను వేటలో ఉన్నట్టు సమాచారం. దీంతో భాను లొంగుబాటు మార్గం ఎంచుకుంటున్నట్టు తెలిసింది.

English summary
Main suspect in Maddelacheruvu Suri murder case, Bhanu kiran may entered into Andhra Pradesh, according to some news reports. It is said that, Bhanu Kiran is trying surrender before police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X