హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెపిపై టిఆర్ఎస్ దాడిని ఖండించిన చంద్రబాబు, క్షమాపణ చెప్పాలన్న నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Nagam Janardhan Reddy
హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల దాడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం ఖండించారు. జెపిపై దాడి అప్రజాస్వామికం అని చెప్పారు. తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ నాగం జనార్ధన్ రెడ్డి జెపిపై టిఆర్ఎస్ దాడిని ఖండించారు. దాడికి పూనుకున్న టిఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జెఏసితో కలిసినప్పుడే మేం కోదండరాంకు రెండు షరతులు విధించామని చెప్పారు. ఒకటి దాడులు చేయవద్దని, ఆస్తులు నష్టపరచవద్దని సూచించామని, అయితే ఇప్పుడు టిఆర్ఎస్ దాడి చేయడం అమానుషమన్నారు.

నిన్న జుక్కల్ ఎమ్మెల్యే షిండేపైన, ఈరోజు జెపిపైన దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలకు కూడా నాగం ఓ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ టిడిపి పోరం తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గితే మమ్మల్ని అడ్డుకోండని సూచించారు. కానీ టిఆర్ఎస్‌లో ఉండే పోరాడమనడం ఏమిటని ప్రశ్నించారు. అందరూ రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందని, కాంగ్రెస్, టిఆర్ఎస్ రాజీనామాలతో వస్తే టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు సిద్ధమని ప్రకటించారు.

English summary
TDP president Chandrababu Naidu and Telangana TDP Forum convener Nagam Janardhan Reddy condemned TRS MLAs attack on Lok Satta President Jayaprakash Narayana today. Nagam demanded for TRS sorry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X