జెపి ఖబర్దార్: హెచ్చరించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు

Harish Rao
హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్‌రావు గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు అమరులైనప్పుడు, 56 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో ప్రజల ఆకాంక్ష, రాజ్యాంగం గుర్తుకు రాని జెపికి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజల రోదన అరణ్య రోదనగా మారిన విషయం ఆయనకు తెలియదా అన్నారు. తెలంగాణ ఓట్లతో గెలిచిన జెపి తెలంగాణ వ్యతిరేకిగా మారారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోవడం బాధ కలిగించిందన్నారు.

త్వరలో ప్రజలు జెపిపైకి తిరగబడే రోజు వస్తుందన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా జెపిని గౌరవిస్తామని, అయితే సీమాంధ్ర పక్షపాతిగా మాత్రం ఖబర్దార్ అని హెచ్చరించారు. జెపి ఎక్కువ సేపు మాట్లాడుతుంటే మాత్రమే వారించామని సిరిసిల్ల ఎమ్మెల్యే కె తారకరామారావుచెప్పారు. ఆయనపై టిఆర్ఎస్ దాడి చేయలేదని చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు ప్రభుత్వ కార్యకలాపాలు అడ్డుకుంటామని టిడిపి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. కాగా ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావుపైనా టిఆర్ఎస్ దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+