తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కితాబిచ్చిన టిడిపి నేత కడియం

తెలంగాణ కోసమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంచి పని చేశారని, అయితే తెలంగాణపై స్పష్టమైన హామీ వచ్చే వరకు వారు ఢిల్లీనుండి రాకుడదని కోరారు. తెలంగాణ కోసం పోరు చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలంటే ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు స్పష్టమైన హామీతో రావాలని, లేదంటే ప్రజలు నమ్మే పరిస్థితి పోతుందని సూచించారు. టిడిపిలోనే కాకుండా అన్ని పార్టీలు ప్రాంతాల వారిగా విడిపోయారని చెప్పారు. టిడిపి తెలంగాణలో విబేదాలు నిజం కాదని చెప్పారు. టిడిపి సీనియర్ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య విబేధాలు తలెత్తాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.












Click it and Unblock the Notifications