ఎమ్మెల్యేల దాడి సిగ్గుపడాల్సిన విషయం, చీకటి రోజు: సిఎం కిరణ్

క్లిప్పింగ్సును పరిశీలించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకరు నాదెండ్ల మనోహర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు ఇలా చేస్తారని ఎవరూ ఊహించరని, రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరసనలు తెలియజేసేందుకు పద్ధతులు ఉంటాయని, అయితే ఈ పద్ధతి మాత్రం ప్రజలు ఆమోదించరన్నారు. అసెంబ్లీ ప్రజల సమస్యల పరిష్కరించడానికి వేదిక అని, అలాంటి వేదికపైన ఇలాంటి చర్యలు ఎవరైనా ఖండించవలసిందేనని చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, జెపిపై దాడి నేపథ్యంలో బిఎసి సమావేశం ఏర్పాటు చేశారు. బిఎసిలో దాడిని ముక్తకంఠంగా ఖండించారు. కాగా శాసనసభలో నేటి పరిణామాలపై కేంద్రానికి, అధిష్టానానికి ఫోన్‌లో వివరించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications