హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ దీక్షలో కొండా సురేఖ సహా 19 మంది ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఫీజు పోరుకు కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ శుక్రవారం హాజరయ్యారు. ఆమె భర్త, కాంగ్రెసు ఎమ్మెల్సీ కొండా మురళి కూడా దీక్షకు హాజరయ్యారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద వరలక్ష్మీ ప్రాంగణంలో జగన్ శుక్రవారం దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సాగుతుంది. వైయస్ జగన్‌కు కొండా సురేఖ దూరమవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అది నిజం కాదని, ఆమె జగన్ వెంటే ఉండడానికి నిర్ణయించుకున్నారని దీక్షకు హాజరు కావడాన్ని బట్టి అర్థమవుతోంది. జగన్ దీక్షకు 19 మంది శాసనసభ్యులు హాజరైనట్లు సమాచారం.

వైయస్ జగన్ దీక్షకు వచ్చినవారిలో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. మిగతా 15 మంది కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శానససభ్యులు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి దీక్షకు హాజరయ్యారు. తెలుగుదేశం శానససభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగి రెడ్డి వైయస్ జగన్ దీక్షకు వచ్చారు. దీక్షకు హాజరైన కాంగ్రెసు శాసనసభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, బాబూరావు, రాజా అశోక్ బాబు, రవి, గుర్నాథ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, జయసుధ, ఆదినారాయణ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.

English summary
Congress MLA Konda Surekha attended YS Jagan's fast today. Total 19 MLAs attended for this pogramme. Two MLAs each from TDP and Prajarakyam also present. Congress MLAs are 15 among the MLAs attended the deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X