జెపిపై మొదటి దాడి చేసింది టిడిపియే, తర్వాత తెరాస దాడి: పాలడుగు
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన శాసనసభ్యులపై వెంటనే చర్యలు తీసుకోకుంటే రేపటినుండి నేను సభలో కూర్చోనని శాసనమండలి సభ్యుడు పాలడుగు శుక్రవారం డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కొన్నిసార్లు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై ముందుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేశారని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కె తారకరామారావు, హరీష్‌రావు అసభ్య పదాలతో దాడి చేశారని అన్నారు.
కాగా జెపిపై, పాలడుగుపై దాడి చేసిన టీఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ మల్లేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరికాసేపట్లో మల్లేష్ పోలీసుల ముందు లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది.
MLC Paladugu Venkatrav demanded today to take action against TRS and TDP MLAs. He said if speaker will not take action, he will not sit in the session. He clarrified that JP attacked by TDP first.