తెలంగాణపై సమైక్యవాదులను కాంగ్రెసు ఒప్పించి, జూన్‌లో ప్రకటన?

తెలంగాణపై వైఖరి స్పష్టం చేయాలని ఢిల్లీలో నాలుగైదు రోజుల మకాం వేసిన తమ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు కూడా అధిష్టానానికి చెందిన నాయకులు ఇదే విషయం చెప్పారని అంటున్నారు. ముఖ్యంగా, తెలంగాణలో పార్టీకి విజయావకశాలు ఉండేలా పరిస్థితులను సృష్టించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తోందని చెబుతున్నారు. తెలంగాణ ఇస్తే, ఆ క్రెడిట్ అంతా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు దక్కుతుందని, అలా కాకుండా తమకే ఆ క్రెడిట్ దక్కేలా చూసుకుని కాంగ్రెసు అధిష్టానం ప్రకటన చేస్తుందని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications