లగడపాటితో పాటు సీమాంధ్ర ఎంపీలకు అహ్మద్ పటేల్ వార్నింగ్
National
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: తెలంగాణ వద్దంటూ పార్లమెంటులో బుధవారం కరపత్రాలు పంచిన ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అక్షింతలు వేశారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మరికొంత మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను పిలిచి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి పద్ధతి మంచిది కాదని ఆయన చెప్పారు. బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్, జెడియు నేత శరద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్‌లకు వారు కరపత్రాలు పంచి పెట్టారు. మంగళవారంనాడు హైదరాబాదును సీమాంధ్రతో కలుపుతూ తయారు చేసిన చిత్రపటాన్ని పార్వమెంటులో వారు పంచి పెట్టారు.
లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివ రావు, అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్ తదితర పార్లమెంటు సభ్యులు పకడ్బందీగా ఆ కరపత్రాలను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 300 మంది పార్లమెంటు సభ్యులు ఆ కరపత్రాలను పంచిపెట్టినట్లు సమాచారం. కరపత్రాల పంపణీ విషయంలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఒక పథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ఎంపీల చర్య పార్టీకి నష్టం కలిగిస్తుందని అహ్మద్ పటేల్ చెప్పినట్లు సమాచారం.
Congress president Sonia Gandhi political advisor Ahmad Patel warned Lagadapati rajagopal and Seemandhra MPs for distributing pamphlets opposing Telangana. Ahmed Patel advised not to resort such activities in future.
Story first published: Wednesday, February 23, 2011, 16:26 [IST]