వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ‌: తెలంగాణ అంశంపై తాము రాజీనామాలు చేయడానికి సిద్ధమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రకటన చేసేవరకు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని వారు చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసిన తర్వాత వారు బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెప్పే వరకు తాము పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ విషయం తాము ప్రధానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను పార్లమెంటులో తాము ప్రతిబింబించామని, అధికార పార్టీకి చెందినవారమైనా తెలంగాణపై పార్లమెంటులో ఆందోళనకు దిగామని ఆయన చెప్పారు.

లోకసభలో తమకు సంఘీభావం తెలిపిన పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో 48 గంటల బంద్ జరుగుతోందని, సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతోందని, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఆ విషయాన్ని తాము కేంద్రం దృష్టికి తేవడంలో విజయం సాధించామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తప్ప మరోదానికి తాము ఆంగీకరించే ప్రసక్తి లేదని తాము ప్రధానికి స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. శాసనసభలో కూడా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తాము పార్లమెంటులో వ్యవహరించిన తీరులో వ్యవహరించాలని ఆయన కోరారు. గవర్నర్ నరసింహన్‌ను రీకాల్ చేయాలని తాము ప్రధానిని కోరినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు తాము ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. తాము రెండు గంటల తర్వాత ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలను కూడా అడ్డుకుంటామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

English summary
Congress Telangana region MPs met PM Manmohan singh today and urged to make a statement for formation of Telangana state. Ponnam Prabhakar briefing the media warned central Government that they will stall Loksabha proceedings on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X