సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రు, పిసిసి అధ్యక్షుడు డిఎస్‌తో భేటీ
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రుగా ఉన్న మాజీ మంత్రులు, చిత్తూరు జిల్లాకు చెందిన శానససభ్యులు కుతూహలమ్మ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. తమకు మంత్రి పదవులు ఇవ్వలేదని కుతూహలమ్మ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్ర విమర్శలు కూడా చేశారు. వారికి డి. శ్రీనివాస్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డి. శ్రీనివాస్ గురువారం బిజీగా గడిపారు. ఆయనను పలువురు నాయకులు వచ్చి కలుసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల శానససభ్యులు కూడా గురువారం డి. శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా, పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు కూడా డిఎస్‌ను కలిశారు. ఆయన ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. పార్టీకి అందించిన సేవలకు గాను తనను మండలికి ఎంపిక చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
Chittoor district MLAs Kuthuhalamma and Peddireddy Ramachandra Reddy met PCC president D Srinivas today. The two MLAs are unhappy with CM Kiran Kumar Reddy for not inducting into the Cabinet.
Story first published: Thursday, February 24, 2011, 15:43 [IST]