వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యులు స్పీకర్ పోడియం వద్దకు రాలేదా, పార్లమెంటులో సీమాంధ్ర సభ్యులు ఆందోళనకు దిగలేదా, మీరెందుకు వెనకాడుతున్నారని ఆయన అడిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుకు రాకపోతే చరిత్రహీనులవుతారని ఆయన అన్నారు. తొమ్మిది రోజులుగా సహాయ నిరాకరణ జరుగుతోందని, 48 గంటల బంద్ విజయవంతమైందని, ఇవి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులకు కనిపించడం లేదా అని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రణాళికకు కట్టుబడి పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.