వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుల కోసమే నా రైల్వే బడ్జెట్: రైల్వే మంత్రి మమతా బెనర్జీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
న్యూఢిల్లీ: తన బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా ఉంటుందని రైల్వే మంత్రి మమతా బెనర్జీ చెప్పారు. 2011 - 12 సంవత్సరానికి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమె శుక్రవారం పార్లమెంటుకు చేరుకున్నారు. అంతకు ముందు తన నివాసంలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రయాణికుల చార్జీల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వందకు పైగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 12కు పైగా నాన్ స్టాప్ డ్యూరోంటోస్ ఉంటాయి. మెట్రోల్లో భారీ కిచెన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టునున్నట్లు తెలుస్తోంది.

శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. రాష్టానికి భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తారని భావిస్తున్నారు. పరీక్షల సమయాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపనున్నట్లు ఆమె ప్రకటించే అవకాశాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్య మల్టీ మోడ్ రవాణా వ్యవస్థను ఆమె ప్రస్తావించే అవకాశాలున్నాయి. ముంబై శివారు రైల్వే వ్యవస్థను పెంచుతారని అంటున్నారు. రైల్వే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో మమతా బెనర్జీ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నారు. నాగపూర్‌లో కొత్త పారిశ్రామిక వాడ, గ్రీన్ టాయిలెట్ ఉత్పత్తి కర్మాగారం ఏర్పాటుకు ఆమె ప్రకటన చేయవచ్చు.

English summary
Union Railway Minister Mamata Banerjee has left for the Parliament to present the 2011-12 Rail Budget. On her way to the Parliament, Mamata made a brief stop at the Rail Bhavan to collect the Budget speech.Before leaving for the Parliament, Mamata spoke to reporters at her residence here and said the Rail Budget will be for the common man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X