వైయస్ జగన్ విషయం ఎన్నికల్లో ప్రజలే చూసుకుంటారు: విహెచ్

జగన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని, కానీ ఆయన అన్ని ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందు వారి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని ఆయన ప్రశ్నించారు. ప్రజలంతా జగన్‌ను చూస్తున్నారని, ప్రజలే ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో జగన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్, ఓబుళాపురం గనులు అన్ని అక్రమాలపైనా ప్రభుత్వం దర్యాఫ్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని, వారు అవినీతికి తిరగబడే రోజు వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications