ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రూ. 1.8 లక్షలకు పెంపు

Pranab Mukherjee
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పెంచారు. 2011 - 12 ఆర్థిక సంవత్సరానికి సోమవారం బడ్జెట్ పరిమితిని 1.6 లక్షల నుంచి 1.8 లక్షల రూపాయలకు పెంచారు. దీంతో ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. సీనియర్ పౌరుల వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. వీరి ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని 2.4 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయలకు పెంచారు. 80 ఏళ్ల వయస్సు దాటిన సీనియర్ పౌరుల ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని ఐదు లక్షల రూపాయలుగా నిర్ధారించారు. ఆయుం పన్ను మినహాయింపు పరిమితి కెటగిరీల్లో ప్రణబ్ ముఖర్జీ స్వల్ప మార్పులు చేశారు.

పన్నుల రాబడి అంచనా 9 లక్షల 32 వేల 440 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. సర్వీస్ పన్నులో ఏ విధమైన మార్పు చేయలేదు. పన్నుల విధానాన్ని ఆధునీకరించి, సరళతరం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను 2012 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని, సరుకులు, సర్వీస్ పన్నుల బిల్లును ఈ ఏడాది పార్లమెంటులో ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు. సర్వీస్ పన్ను రీఫండ్‌కు కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి జారీ చేసే 30 వేల కోట్ల టాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+