సెల్‌పోన్, సిమెంట్ ధరలు తగ్గాయి, బంగారం ధర పెరిగింది!
National
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు పెద్ద పీట వేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో రానున్న రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశ పెట్టినట్టుగా ఉంది. అయితే సామాన్యులపై కాస్త కరుణ చూపినట్లుగా కనిపిస్తోంది. అయితే సామాన్య ప్రజానీకం పెట్రోలు, డీజిల్ ధరలపై ఏమైనా సుంకం తగ్గుతుందేమోనని ఎదురు చూసినప్పటికీ నిరాశే ఎదురయ్యింది. అయితే ప్రణబ్ బడ్జెట్‌పై కాంగ్రెసు పార్టీ ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేయగా, విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
ఇవి తగ్గినవి:-సబ్బులు, హోమియో మందులు, సిమెంట్ ధరలు, వ్యవసాయ పనిముట్లు, మొబైల్ ఫోన్ల ధరలు, ముడి ఇనుము, నూలు ధరలు, ఎలక్ట్రానికి వస్తువులు, ఎల్‌ఇడి టీవీలు, బ్యాటరీ కార్లు, కన్వర్షన్ కిట్లు, పోలార్ ఉత్పత్తులు, బేబీ డైపర్లు మొదలగునవి.
ఇవి పెరిగినవి:- బ్రాండెడ్ దుస్తులు, ఏసి బార్లు, ఏసీ ఆసుపత్రుల్లో వైద్యం, విమానయానం, బంగారం ధరలు, హోటల్ రూంల అద్దెలు, బీమా సేవలు, న్యాయ సేవలు మొదలగులవి. కాగా పెద్ద కార్ల ధరలు కూడా తగ్గనున్నాయి. 130 కొత్త వస్తువులపై 1 శాతం పన్ను పడనుంది.
Central Financial Minister gave importance to agriculture and infrastructure in his budget. He proposed budget on monday. Cell Phones, soaps, Cement rates will decreased and AC Cars, flight charges, gold rates will increased.
Story first published: Monday, February 28, 2011, 14:35 [IST]