కెసిఆర్, విజయశాంతి నినాదాలు: తెలంగాణపై మళ్లీ లోకసభ వాయిదా
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై లోకసభ గురువారం రెండో సారి వాయిదా పడింది. తెలంగాణ అంశంపై గొడవ జరగడంతో స్పీకర్ మీరా కుమర్ తొలిసారి లోకసభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తెలంగాణ నినాదాలు చేశారు. వారికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సభ్యుల మద్దతు లభించింది. ఈ గందరగోళం మధ్యనే మీరాకుమార్ సభను పది నిమిషాల పాటు సాగించారు. అయితే, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని వాతావరణం ఏర్పడడంతో సభను మీరా కుమార్ రెండోసారి వాయిదా వేశారు.
తెరాస సభ్యులు తెలంగాణపై ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతున్న సమయంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) సభ్యులు తెరాస సభ్యులకు మద్దతు తెలుపతూనే టీవీ చానెళ్ల వివాదాన్ని ముందుకు తెచ్చారు. దీంతో సభలో మరింత గందరగోళం చోటు చేసుకుంది. తెలంగాణ అంశంపై లోకసభలో తక్షణమే చర్చ జరగాలని తెరాస సభ్యులు పట్టుబట్టారు. కెసిఆర్, విజయశాంత జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
Lok Sabha adjourned second time thursday on Telangana issue. TRS members K Chandrasekhar Rao and Vijayashanthi started giving Telangana slogans at speaker podium. Congress Telangana MPs supported them.
Story first published: Thursday, March 3, 2011, 12:19 [IST]