ఇంటర్ పరీక్షలపై గందరగోళం, ఆందోళన: ఎవరి పట్టు వారిదే

తొలుత ప్రకటించిన విధంగానే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 7 నుంచి జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. మార్చి 10న ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం ఆంగ్లం-2 పరీక్ష నిర్వహణలో కూడా ఎటువంటి మార్పు ఉండదన్నారు. 10న 'మిలియన్ మార్చ్ టు హైదరాబాద్' సందర్భంగా ఈనెల 7 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షలను వాయిదావేయాలని తెరాస డిమాండ్ చేసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. జాతీయ స్థాయి పరీక్షలకు విద్యార్థులు హాజరవుతుంటారని, ఇక్కడ పరీక్షలను వాయిదావేస్తే నష్టపోతారని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే తెరాస నేతలతో మాట్లాడినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications