పట్టువీడని కెసిఆర్, తెలంగాణ అంశంపై దద్ధరిల్లిన లోకసభ

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నోళ్లకు నల్టటి రిబ్బన్లు ధరించి సభకు హాజరయ్యారు. రిబ్బన్లు తీసేయాలని స్పీకర్ వారికి సూచించారు. అయినా వారు వినలేదు. గురువారం రాత్రి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ పార్లమెంటు సభ్యులతో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ప్రణబ్ ముఖర్జీ వారికి ఏ విధమైన హామీ ఇవ్వలేదు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పారే గానీ ఏ విధమైన హామీ ఇవ్వలేదు. దీంతో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత సజావుగా సాగింది.












Click it and Unblock the Notifications