వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యూపిఎకు బయటినుండి జయలలిత మద్దతు: ప్రభుత్వంలోకి ములాయం!

యూపిఎనుండి బయటకు వెళ్లనున్న డిఎంకెకు 18 పార్లమెంటుసభ్యుల సీట్లు ఉండగా, ఎస్పీకి 22 సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా తమిళనాడులో కూడా జయలలిత కేంద్రానికి మద్దతును ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే డిఎంకే పూర్తిగా యూపిఎనుండి తొలగిపోతే తాము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. జయలలిత పార్టీ అన్నాడీఎంకెకు 9 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే మద్దతు విషయంపై జయలలిత ఇంకా పూర్తిగా చెప్పలేదని, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపలేదని కాంగ్రెస్ అంటోంది. కాగా డిఎంకె సైతం సీట్ల సర్దుబాటు విషయంలో సోమవారం వరకు వేచి చూసే ధోరణి అవలంభించనున్నట్టుగా సమాచారం.