వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు: కిషన్‌రెడ్డి

ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో కేంద్రం బిల్లు పెడితే చాలన్నారు. తెలంగాణ కోసం రాష్ట్రంనుండి ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా బిజెపి ఇస్తుందని చెప్పారు. మార్చ్ 10వ తేదిన తెలంగాణ ఐక్య కార్యాచరణ తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు బిజెపి మద్దతు ఇస్తుందన్నారు. అయితే పరీక్షలు జరుగుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. తెలంగాణ కోసం అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీ పర్యటనలకు మాత్రమే పరిమితం అయ్యారని ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు.