హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ఉన్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఆదివారం అన్నారు. తెలంగాణ కోసం మేం లోక్‌సభలో తీవ్రంగా పోరాడుతామని చెప్పారు. రేపు సభలో ఎలా ప్రతిఘటిస్తామో చూడండని చెప్పారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు మొదలు పెట్టే వరకు ప్రతిఘటనను ఆపేది లేదన్నారు.
తెలంగాణపై కేంద్రం వాయిదాలు వేసుకుంటూ పోతే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఉద్యమాన్ని ఎంతగా అణిచి వేస్తే అంత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. రాజీనామా ఆస్త్రం కేవలం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, తెలంగాణ ప్రకటిస్తుందని చెప్పారు.
Nizamabad Parliament Member Madhuyaski said they will not stop agitation in Lok Sabha till propose Telangana bill. He said Telangana agitation will increase if government trying to destoy it.
Story first published: Sunday, March 6, 2011, 16:36 [IST]