పిడమర్తితో సహా పలువురి అరెస్టు: పోలీసుల ముందస్తు చర్యలు

ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లానుండి సైకిల్ యాత్రతో వస్తున్న పదిమంది విద్యార్థులను కూడా పోలీసులు చిగురుమామిడి వద్ద అరెస్టు చేశారు. అయితే రవి అరెస్టులో ఓయు విద్యార్థి జెఏసి ఖండించింది. రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పిడమర్తి రవి అరెస్టును తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం కూడా ఖండించారు. రవిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు రోజుల ముందే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు తెరలేపిందన్నారు.
పోలీసులు మరికొందరు నేతల కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా నగర పోలీసు కమిషనర్ ఎకే ఖాన్ విద్యార్థుల తల్లిదడండ్రులను కొన్ని సూచనలు చేశారు. మార్చి 10వ తేదిన పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులను తీసుకు రావాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. నగరంలో చేసే ధర్నాలకు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు ఉండాలని ఉద్యమకారులకు ఎకె ఖాన్ సూచించారు. మిలియన్ మార్చ్ నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసులను మోహరిస్తున్నట్టు చెప్పారు. అదనపు బలగాలను మోహరిస్తామని అన్నారు.