కేంద్ర నిర్ణయం తెలంగాణకు వ్యతిరేకమైతే 24 గంటల్లో రాజీనామా: నాగం

తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తెనే తెలంగాణ వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత జగదీశ్వర్ రెడ్డి అన్నారు. జాతీ మొత్తం ఏకమై పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు. ఉద్యమ ప్రాధాన్యత తెలుసుకొని తెలంగాణ ప్రజా ప్రతినిధులు అంతా పోరాడాలని చెప్పారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలంగాణపై కేంద్రానికి తప్పుడు సంకేతాలు అందించి తెలంగాణకు అడ్డుపడుతున్నారని ఎంపీ వివేకా అన్నారు. గవర్నర్‌ను కేంద్రం వెంటనే వెనక్కి పిలవాలని కోరారు. కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. తెలంగాణ కొట్లాడితే తప్పకుండా వస్తుందని భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
నాగం జనార్ధన్ రెడ్డి బండారు దత్తాత్రేయ తెలంగాణ హైదరాబాద్ nagam janardhan reddy bandaru dattatreya telangana hyderabad
English summary
TDP senior MLA Nagam Janardhan Reddy said they will resign in 24 hours if centre will take decission againt seperate
Telangana. Nagam, MP Vivek, TRS leader Jagadeshwar Reddy and BJP senior leader Bandaru Dattatreya participate
in Rythu Maha Deeksha on sunday which is held at Indira Park.
Story first published: Sunday, March 6, 2011, 16:04 [IST]