జడ్జిల పరీక్షను అడ్డుకున్న లాయర్లు: రోడ్డుపైనే ఆందోళన, అరెస్టు

రాష్ట్రం ఏర్పడితే కానీ న్యాయం జరగదన్నారు. పలువురు అభ్యర్థులు పరీక్షలను బహిష్కరించి తమ హాల్ టిక్కెట్లను చించి వేశారు. అక్కడే ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జిల్లా జడ్జిల పరీక్షాకేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందే బందోబస్తు ఏర్పాటు చేయడంతో రోడ్డు మీద బైఠాయించిన న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రతను నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ పర్యవేక్షించారు.