హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరగా తేల్చండి, సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాం: ఎంఐఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం చెప్పారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని గతంలో కూడా పలుమార్లు చెప్పామన్నారు. అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నామన్నారు. టాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం వైఖరిపై ప్రశ్నించగా సమైక్యాంధ్రకే మా ఓటు అన్నారు.

హైదరాబాద్‌ను విభజించడం తమకు ఇష్టం లేదని చెప్పారు. రాజధానిలో విధ్వంసాలు జరగడం శోచనీయమన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం నాన్చడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు మరింత పెరిగాయన్నారు. గతంలో చిదంబరంతో భేటీ సమయంలో కూడా తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గతంలో అఖిలపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్‌పై నిర్వహించారన్నారు. తెలంగాణపై కేంద్రం తక్షణమే నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary

 MIMLP Akbaruddin Owaisi said that they are committed for united andhra pradesh. He condemned yesterday's issue. 
 
 He said that they do not want to split Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X