వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హసన్ అలీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చుక్కెదురు

కొన్ని షరతులపై కోర్టు హసన్ అలీ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఐదు రోజుల పాటు ముంబైని వదిలి వెళ్లకూడదని, ప్రతి రోజూ ఇడి అధికారుల ముందు హాజరు కావాలని షరతులు పెట్టింది. స్థానిక కోర్టు ఆదేశాలను పై కోర్టులో సవాల్ చేస్తామని ఇడి అధికారులు చెప్పారు. హసన్ అలీ ఖాన్ 8 బిలియన్ అమెరికా డాలర్లకు పైగా స్విట్జర్లాండ్‌లోని యుబిఎస్ బ్యాంకుకు అక్రమంగా తరలించినట్లు, ఇతర అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.