ట్యాంక్‌బండ్ విగ్రహాల ధ్వంసంపై భగ్గుమన్న సీమాంధ్ర, కోదండరామ్‌పై గుర్రు

మిలియన్ మార్చ్‌ను తెలంగాణ దొరల ఆధిపత్యం కోసం సాగిన మూర్ఖత్వపు ఉద్యమంగా సమైక్యాంధ్ర బలహీన వర్గా జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు వైవి సురేష్ వ్యాఖ్యానించారు. ఆశాస్త్రీయమైన వాదనలతో తెరాస నాయకులు ప్రజలను రెచ్చగొడుతూ బలి చేస్తున్నారని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీకి 20 కోట్లు ఖర్చయినా తెరాసకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు. సమసమాజ నిర్మాణానికి పాటుపడిన మహామహుల విగ్రహాలను ధ్వంసం చేయడం, వార్తల సేకరణకు వచ్చిన మీడియాపై దాడులు చేయడం తెలంగాణ ఉద్యమమా అని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో యువకులను రెచ్చగొడుతున్న కోదండరామ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విగ్రహాల ధ్వంసంపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకుడు కె. ఎర్రంనాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications