వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి షాక్!

ఈ సందర్భంగా జెసి వర్గానికి చెందిన 54 మంది ఎంపీటీసీలు, 4గురు ఎంపీపీలు, 4గురు జెడ్పీటీసీలు పాటిల్ వేణుగోపాల్ రెడ్డితో మేం మీకు ఓటు వేయమని మొహం మీదే చెప్పేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి తాము ఓటు వేసేది లేదని చెప్పారు. తమ నేత జెసి దివాకర్ రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వనందునే తాము ఓటు వేయడం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓటు వేయకుండా వీరంతా గోవాగానీ, ఊటీకి గానీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా జెసి దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనందునే ఈ చర్యకు పూనుకున్నట్టులాగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడానికి శాయశక్తులా కృషి చేస్తున్న సిఎంకు సొంత పార్టీలో ఉంటూనే జెసి షాక్ ఇచ్చారని పలువురు అంటున్నారు.
Comments
jc diwakar reddy kirankumar reddy congress ananthapur జెసి దివాకర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అనంతపురం
English summary
Ex minister, Ananthapur district senior congress MLA JC Diwakar Reddy gave shocked to CM Kirankumar Reddy
today. JC camp ZPTC, MPP and MPTC were confirmed that they were not vote to any one in MLC election.
Story first published: Sunday, March 13, 2011, 16:13 [IST]