భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. సామాన్యులు కుదేలు.. ఈ పరిస్థితుల వెనుక
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ముడి చమురు ధరలు నిరంతరం పెరగడం, అదే సమయంలో స్థానిక మార్కెట్లలో నిత్యావసరాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల ధరలు ఆకాశాన్నంటడం వంటి పరిణామాలు సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. ఈ రెండు ప్రధాన శక్తుల ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం రేటు తీవ్ర రూపం దాలుస్తోంది.
ముడి చమురు ధరల ప్రభావంతో రవాణా చార్జీల పెరుగుదల
మధ్యతరగతి మరియు పేద కుటుంబాలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అనేది నానాటికీ భారంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు సప్లై చెయిన్ లో తలెత్తిన అడ్డంకుల కారణంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భారత్ తన చమురు అవసరాల కోసం ఇతర దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో, అంతర్జాతీయ ధరల పెరుగుదల దేశీయంగా రవాణా ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

కూరగాయల ధరల పెరుగుదలకు ఎన్నో కారణాలు
పెట్రోల్, డీజిల్ ధరల భారం పరోక్షంగా అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతోంది. రవాణా వ్యయం పెరగడం వల్ల నిత్యావసర సరుకులు, పండ్లు, ఇతర వినియోగ వస్తువుల రేట్లు కూడా పైపైకి దూసుకుపోతున్నాయి. మరోవైపు, వేసవి తీవ్రత మరియు అకాల వాతావరణ మార్పుల వల్ల కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గింది.
సెంచరీ మార్కును దాటి పెరుగుతున్న కూరగాయల ధరలు
మార్కెట్లకు వచ్చే సరుకు పరిమాణం తగ్గడంతో టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సహా దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. నిన్నటివరకు కిలో ముప్పై, నలభై రూపాయలు పలికిన కూరగాయలు, ఇప్పుడు సెంచరీ మార్కును దాటేస్తున్నాయి. చమురు ధరల వల్ల పెరిగిన రవాణా ఖర్చులు వీటికి తోడవడంతో సామాన్యుడు మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
గృహిణులకు సవాల్ గా మారుతున్న బడ్జెట్ నిర్వహణ
ఆదాయాలు పెరగకపోయినా, ఈ విధంగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండటంతో నెలవారీ బడ్జెట్ నిర్వహణ గృహిణులకు పెద్ద సవాలుగా మారింది. తక్కువ ధరలు ఉన్న కూరగాయలను వెతుక్కు తెచ్చుకుని వండుకు తినే పరిస్థితి వచ్చింది. తాజా పరిస్థితులతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఇంధన ధరలపై పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications