భారత్ లోకి పాకిస్థాన్ ఉత్పత్తులు..! రంగంలోకి దర్యాప్తు బృందాలు..

భారత్ లోని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లోయలో గతేడాది ఏప్రిల్ 22 న ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటనకు కారణమని తెలిసిన నేపథ్యంలో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసింది. ఈ మేరకు వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే పాకిస్థాన్ ఉత్పత్తులపైనా నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇలాంటి కఠినమైన నిర్ణయాలను భారత్ తీసుకుంది.

Pune Shock Made in Pakistan Bedsheets Found Police Investigating Illegal Supply Route pakistan

అయితే ఇటీవలి కాలంలో పాకిస్థాన్ ఉత్పత్తులు భారత్ లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల మేడ్ ఇన్ పాకిస్థాన్ ఫ్యాన్ వార్తను మరువక ముందే మహారాష్ట్రలోని పూణెలో మరో షాకింగ్ ఘటన తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పూణెలోని చించ్వాడా ప్రాంతంలోని మోర్యా గోసావి గణపతి ఆలయం వద్ద నిర్వహించిన జాతరలో ఓ మహిళ బెడ్ షీట్ ను కొనుగోలు చేసింది. ఆ బెడ్ షీట్ ను ఇంటికెళ్లి చూడగా దానిపే 'మేడ్ ఇన్ పాకిస్థాన్' అని స్టిక్కర్ ఉంది. ఈ మేరకు ఆ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

పాకిస్థాన్ ఉత్పత్తులపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఇలాంటి వస్తువులు స్థానిక మార్కెట్ లోకి ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని.. కొనుగోలు దారులు జాగ్రత్తగా ఉండాలని ఈ మేరకు ఆ మహిళ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే స్పందించారు. పోలీస్ అధికారి రంజిత్ జాదవ్ నేతృత్వంలో ఈ వ్యవహారంపై విచారణకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెడ్ షీట్ విక్రయించిన వ్యక్తిని గుర్తించేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. గతంలోనూ మేడ్ ఇన్ పాకిస్థాన్ అని ఉన్న ఫ్యాన్ కు సంబంధించిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+