ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో వీటి పొడిని తీసుకుంటే చాలు.. !!

ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలకు విశిష్ట స్థానం ఉంది. అందులో ఒకటి.. నేల ఉసిరి (Bhumi Amla). ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధంగా గుర్తింపు పొందింది. ఇటీవలి కాలంలో నేల ఉసిరి పొడి ఆదరణ బాగా పెరుగుతోంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడం మొదలుకుని అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరచడం వరకు నేల ఉసిరి గానీ, దాని పౌడర్ గానీ అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేదం ప్రకారం.. ఎటువంటి రసాయనాలు లేదా కృత్రిమ ప్రిజర్వేటివ్‌ లేని ఈ ప్రకృతి ప్రసాదిత మూలిక.. అన్ని రకాల చర్మ తత్వాల వారికి ఉపయోగకరం. ఈ నేల ఉసిరి పొడిని రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవడం చాలా మంచిది. దీనిని ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించడమే కాకుండా రోజూ గోరువెచ్చని నీరు, తాజా పండ్ల రసాలు, స్మూతీలు లేదా పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. శరీరంలోని ప్రమాదకరమైన టాక్సిన్స్ ను సమర్థవంతంగా తొలగించడం, సహజసిద్ధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ పొడి కీలక పాత్ర పోషిస్తుంది.

Bhumi Amla and Its Powder for Immunity Blood Sugar Balance Rich in Vitamin C and antioxidants

నేల ఉసిరి పొడి ప్రధానంగా కాలేయ ఆరోగ్యాన్ని రక్షించడంలో ఒక సంజీవనిలా సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తూ, కడుపులో యాసిడ్ల అధిక ఉత్పత్తిని అదుపు చేస్తుంది. దీనివల్ల ప్రాణాంతకమైన అసిడిటీ సమస్యల నుంచి కూడా వేగంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణాశయం దెబ్బతినకుండా కాపాడటంతో పాటు కడుపులో అల్సర్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే దెబ్బతిన్న చర్మ కణాలను తిరిగి పునరుజ్జీవింపజేయడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి.

చర్మ సమస్యలు, అలర్జీలతో బాధపడేవారికి నేల ఉసిరి పొడి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు, నల్లటి మచ్చలు, వాపులను తగ్గించి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కేశ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందీ నేల ఉసిరి పౌడర్. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అనేక ఆయుర్వేద సౌందర్య సాధనాలలో దీనిని వాడుతున్నారు. నేల ఉసిరిలో విటమిన్ సీ, శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

నేల ఉసిరిలో లిగ్నాన్స్, ఫిలాంథిన్, హైపోఫిలాంథిన్ వంటి కీలక ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి హెపటైటిస్ బీ, కామెర్లు, లివర్ సిరోసిస్ వంటి కాలేయ సమస్యల నివారణలో కీలకంగా పనిచేస్తాయి. ఆయుర్వేద, సిద్ధ, యునానీ వైద్య విధానాలలో ఈ మూలికను కాలేయానికి రక్షణగా, కిడ్నీల్లో రాళ్లను కరిగించే టానిక్‌గా కూడా ఉపయోగిస్తారు. నేల ఉసిరిలోని చేదు, వగరు రుచులు శరీరంలోని పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి.

నేల ఉసిరి కషాయం సులభంగా తయారు చేసుకోవచ్చు. రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఎండిన నేల ఉసిరి పొడిని గానీ లేదా నలిపిన తాజా ఆకులను గానీ నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. ప్రత్యామ్నాయంగా 10 నుండి 15 మిల్లీలీటర్ల తాజా నేల ఉసిరి రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు.

Disclaimer: నేల ఉసిరి పొడి పూర్తిగా సహజమైనదైనప్పటికీ, దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఈ పొడిని తీసుకోకూడదు. డాక్టర్లు సూచించిన పరిమాణంలో మాత్రమే దీనిని తీసుకోవడం సురక్షితం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+