కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి.. 12 మందికి సీరియస్..

నాగాలాండ్ లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి 9 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగాలాండ్ లోని మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకూ నలుగురు మృతదేహాలను వెలికితీశామని మరో ఐదుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు మోన్ డిప్యూటీ కమిషనర్ వెన్నీ కోయక్ తెలిపారు.

" మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా 9 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాలకు మోన్ టౌన్, టిజిట్ నగరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. కొండ చరియలు కూలాయన్న విషయం మాకు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య సమాచారం అందింది" అని కోన్ యాక్ తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్), పోలీసులు, అసోం రైఫిల్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందాలు అలాగే స్థానిక ప్రజలు సహాయక చర్యలను వేగవంతం చేశారని పేర్కొన్నారు.

Nagaland Tragedy in Nagaland state 9 dead 12 critically injured in landslide heavy rainfall news

ఇప్పటివరకూ నలుగురి మృతదేహాలను వెలికి తీశామని.. అందులో ముగ్గురు మహిళల మృతదేహాలు కాగా.. ఒకరిది మగ మృతదేహం అని డిప్యూటీ కమిషనర్ వెన్నీ కోయక్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం అయింది. ఇదే అంశంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ ఎస్ ఫంగ్ నాన్ కోయక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లు సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వారం అంతా అతి భారీ వర్షాలు నమోదవుతాయని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q