షాకింగ్.. రిటైర్మెంట్ ప్రకటించిన యుజ్వేంద్ర చాహల్

భారత క్రికెట్ జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. లార్డ్స్ లో తన చివరి మ్యాచ్ ఆడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనే చాహల్ సుదీర్ఘ కలలకు అధికారికంగా తెరపడినట్లయింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం పునరాగమనం కోసం తన ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశాడు.

చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన తర్వాత ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు చాహల్. భారత్ తరఫున టెస్ట్ క్యాప్ అందుకోవడం నా కెరీర్ లో అతిపెద్ద కల అని, ఇకపై అది నెరవేరకపోవచ్చని తేల్చి చెప్పాడు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు సాగిన తన ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వ్యాఖ్యానించాడు. రెడ్ బాల్ క్రికెట్ అనేది ఓ ఫార్మాట్ మాత్రమే కాదని, ఓపిక, క్యారెక్టర్, గ్రౌండ్ లో కొన్ని గంటల పాటు శ్రమించడంలో ఉన్న అసలైన సంతోషాన్ని నేర్పుతుందని చాహల్ చెప్పుకొచ్చాడు.

Yuzvendra Chahal Veteran leg spinner announced his retirement from first class cricket competing

హర్యానా తరఫున 2009లో చాహల్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. సుదీర్ఘ కెరీర్‌లో మొత్తంగా 49 మ్యాచ్‌లు ఆడాడు. 32.27 యావరేజ్ తో 148 వికెట్లు నేలకూల్చాడు. ఇంగ్లాండ్ నార్తాంప్టన్‌షైర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన చాహల్.. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో అద్భుత ప్రదర్శన చేశాడు. అక్కడ ఆరు మ్యాచ్‌ల్లోనే 16.14 సగటుతో 21 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. లార్డ్స్ లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్ చాహల్‌కు చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అయింది.

మాజీ సీఎంనే వదల్లేదు.. : కాక్రోచ్ నేతల సంగతి సరేసరి
మాజీ సీఎంనే వదల్లేదు.. : కాక్రోచ్ నేతల సంగతి సరేసరి

టీమిండియా టెస్ట్ జట్టు స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి టాప్ ప్లేయర్స్ తిరుగులేని ప్రదర్శన చేయడంతో చాహల్‌కు టెస్టుల్లో అవకాశం దక్కకుండా పోయింది. గతంలో హర్యానా తరఫున రంజీల్లోనూ చాహల్ ప్రాతినిధ్యం తగ్గింది. చివరగా 2016-17 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అతను 33 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున చాహల్ 72 వన్డేలు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న చాహల్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+