సీఈసీ రక్షణ చట్టంపై సుప్రీంకు ఇండియా కూటమి..! ఇంతకీ అందులో ఏముంది ?

కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కమిషనర్లకు ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. ఈ చట్టం ద్వారా లభించిన రక్షణల్ని వాడుకుని సీఈసీ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్న ఇండియా కూటమి నేతలు.. ఇప్పుడు మూకుమ్మడిగా సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేయబోతున్నారు. ఈ మేరకు ఇండియా కూటమి (INDIA Bloc) పార్టీలు ఉమ్మడిగా పిటిషన్ దాఖలు చేయబోతున్నాయి.

శివాజీ పార్క్ ధర్నాకు పర్మిషన్ ఉందా ? 13 కోట్ల ఓట్లు తీయడానికి ఉందా ?-కాక్రోచ్ కౌంటర్..!
శివాజీ పార్క్ ధర్నాకు పర్మిషన్ ఉందా ? 13 కోట్ల ఓట్లు తీయడానికి ఉందా ?-కాక్రోచ్ కౌంటర్..!

2023లో కేంద్రం పార్లమెంట్ లో ఆమోదించిన ఈ చట్టం కింద ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లకు కల్పించిన చట్టపరమైన రక్షణకు వ్యతిరేకంగా ఇండియా కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం 2023లోని మినహాయింపు నిబంధనను సవాలు చేస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, రాష్ట్రీయ జనతా దళ్, ఇతర ఇండియా కూటమి పార్టీలు కలిసి ఒక సంయుక్త పిటిషన్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణపై కొనసాగుతున్న వివాదం, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

INDIA Bloc Plans Joint Supreme Court Challenge to 2023 Law Protecting CEC Gyanesh Kumar
సీఈసీపై తేల్చేందుకు ఇండియా కూటమి సిద్ధం..! 30న కీలక భేటీ..!
సీఈసీపై తేల్చేందుకు ఇండియా కూటమి సిద్ధం..! 30న కీలక భేటీ..!

2023 చట్టంలోని సెక్షన్ 16 .. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు తమ అధికారిక విధి లేదా పనిని నిర్వర్తించే క్రమంలో లేదా నిర్వర్తించినట్లుగా భావించే క్రమంలో చేసిన, మాట్లాడిన చర్యలు, విషయాలు లేదా మాటలకు చట్టపరమైన రక్షణను కల్పిస్తుంది.ఈ నిబంధన ప్రత్యేకంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఎన్నికల కమిషనర్‌గా 'ఉన్న లేదా గతంలో ఉన్న' వ్యక్తికి వర్తిస్తుంది. అంటే ఈ రక్షణ కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న సీఈసీ లేదా ఈసీకి మాత్రమే పరిమితం కాదు. ఇది మాజీ సీఈసీలు, ఎన్నికల కమిషనర్లు వారి అధికారిక విధి పరిధిలోకి వచ్చే చర్యలకు కూడా వర్తిస్తుంది. కానీ ఈ నిబంధన ప్రతి చర్యకు పూర్తి రక్షణ కల్పించదు. సెక్షన్ 16 ప్రత్యేకంగా అధికారిక విధి లేదా పనికి సంబంధించిన చర్యలు, విషయాలు లేదా మాటలను సూచిస్తుంది. అందువల్ల ఎస్ఐఆర్ వివాదంలో కీలకమైన చట్టపరమైన ప్రశ్న ఏమిటంటే.. సీఈసీ, కమిషనర్లు తీసుకున్న నిర్ణయాలు వారి అధికారిక విధి లేదా పని నిర్వహణలో భాగంగా తీసుకున్నదేనా కాదా అనేది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+