ఇరాన్ నుంచి మాయమైన "మోజ్తబా ఖమేనీ".. ప్రస్తుతం ఎక్కడున్నాడు..?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఓ మీడియా రిపోర్టు కథనం ప్రకారం ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్ లో లేనట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో వర్గాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఇరాన్ లో లేకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సౌదీ అరేబియాకు చెందిన న్యూస్ అవుట్ లెట్ అల్ హదత్ అందించిన సమాచారం ప్రకారం మోజ్తబా ఖమేనీ పేరు మీద ఇస్తున్న ప్రకటనలు ఆయన ప్రత్యక్షంగా ఇస్తున్నవి కావని.. చీఫ్ ఆఫ్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అహ్మద్ వహిదీ పేరు మీద వస్తున్నాయని స్పష్టం చేసింది.

ఈ రిపోర్టు ప్రకారం.. ఇరాన్ లోని హార్డ్ లైనర్స్, ప్రభుత్వం మధ్య ఇరాన్- అమెరికా మధ్య జరిగిన ఒప్పందంపై భేదాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కు సవాల్ గా మారింది. దేశంలోని పదవీ బాధ్యతలను షేరింగ్ చేసుకునే విధానానికి కూడా సవాల్ మారనున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పై రాళ్లు విసిరిన విషయం తెలిసిందే. ఈయన ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేందుకు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అబ్బాస్ అరాగ్చీని డీల్ మేకర్ అని దేశద్రోహి అని నినాదాలు చేశారు ఇరాన్ ప్రజలు.

వెస్ట్రర్న్ మీడియా కథనాల ప్రకారం.. మోజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా పదవి చేపట్టినప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇరాన్ కు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇరాన్ కు చెందిన మాజీ పార్లమెంట్ స్పీకర్ అలాగే చీఫ్ వ్యవహారకర్త మహ్మద్ భాగేర్ ఘలీబఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ లు తీసుకుంటున్నారు.

Mojtaba Khamenei disappeared from Iran amidst tensions in West Asia Where is he now iran America

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన సీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోవడాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా నిలువరించాలన్నదే తమ లక్ష్యం అని ట్రంప్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+