నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు..
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఐపీఎస్ అధికారులు ఇక్కడ శిక్షణ పొందుతారు. అలాంటి చోట లైంగిక వేధింపుల ఘటన సంచలనంగా మారింది.
తనతోపాటు శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అసభ్యకర మెసేజ్ లు పెట్టడంతో పాటు ప్రైవేట్ వీడియోలతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడు తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి వేధించడమే కాకుండా.. భర్తకు వీడియోలు పంపి బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ ఉన్నతాధికారులే ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై పోలీస్ వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులతోపాటు బ్లాక్ మెయిల్, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications