'సీత' పాత్ర కోసం సాయి పల్లవి సంచలన నిర్ణయం.. వ్యాఖ్యలు వైరల్..!
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం 'రామాయణం'. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు దిల్లీలోని భారత్ మండపంలో జూలై 18 న ప్రథమ్ సంకల్ప్ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ పాల్గొని రామాయణం చిత్రంపై ప్రసంగించారు. తమ అనుభవాలను తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొద్దిమంది ముఖ్య అతిథులకు సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ప్రత్యేకంగా చూపించారు.
'రామాయణం' సినిమాలో శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే సీతమ్మ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక హనుమాన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కనువిందు చేయనున్నారు. అలాగే రావణాసురుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటించారు. సూపర్ స్టార్ కాస్ట్ కారణంగా ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ మూవీ కోసం సాయి పల్లవి చేసిన అద్భుతమైన కృషి, ఆమె పవిత్ర భావనలు ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. దిల్లీలో జరిగిన ప్రమోషన్స్ ఈవెంట్ లో సాయి పల్లవి చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సీత పాత్ర కోసం తన ఆలోచనలను పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంచినట్లు సాయి పల్లవి పేర్కొన్నారు. తాను ఈ పాత్రను వెతుక్కుంటూ వెళ్లలేదని.. ఆ సీతమ్మే తనను ఆశీర్వదించిందని సాయి పల్లవి భావోద్వేగానికి లోనయ్యారు. షూటింగ్ సమయంలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని.. "సీతమ్మ.. నా ద్వారా నువ్వే ఈ పాత్రలో నటించు. నా నుంచి ఎలాంటి హావభావాలు వ్యక్తం అవ్వాలో నువ్వే నిర్ణయించు" అని మనస్ఫూర్తిగా వేడుకునేదాన్ని. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు నా ఆలోచనలను ఎంతో పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాను అని తెలిపారు. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక రామాయణం మూవీ ట్రైలర్ జూలై 24న గ్రాండ్ గా విడుదల కానుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ పౌరాణిక చిత్రం మొదటి భాగం 2026 దీపావళికి థియేటర్లలోకి రానుంది. అలాగే సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications