ఎస్ఐఆర్ లో ఈసీ కీలక మార్పు- ఆ జంఝాటం నుంచి విముక్తి

దేశంలో ఓటరు నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో.. ఆన్‌లైన్ ఓటరు నమోదు దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్ 6 నుంచి అదనపు డిక్లరేషన్ సమర్పించాలనే నిబంధనను ఉపసంహరించుకుంది. దీంతో నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇకపై ఎలాంటి అదనపు నిబంధనలు లేకుండా సాధారణ పద్ధతిలోనే ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి.. ఈ నెల 26న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాలలో ఈసీఐనెట్, మొబైల్ యాప్‌, ఆన్‌లైన్ పోర్టల్ అలాగే సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అధికారిక వెబ్‌సైట్ల నుంచి ఈ అదనపు డిక్లరేషన్‌ను తక్షణమే తొలగించినట్లు కూడా ప్రకటించింది ఈసీ.

Form 6 Unchanged in SIR and Non-SIR Periods ECI Ends Confusion Over Declaration Form electoral roll

ఈ అదనపు డిక్లరేషన్ నిబంధన ప్రకారం.. కొత్తగా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలనుకునే వాళ్లు.. తమ తల్లిదండ్రులు, తాతలతో మునుపటి ఓటరు జాబితాలతో ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేసే వివరాలను సమర్పించాల్సి ఉండేది. 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ ప్రకారం అమల్లో ఉన్న ఫామ్-6లో తగిన చట్టసవరణలు చేయకుండా ఇలాంటి మార్పులు చేర్చడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ రాజకీయ పార్టీలు సైతం విమర్శలు చేశాయి.

అన్‌ఎక్స్‌పెక్టెడ్..: తనయుడిని దింపిన వైసీపీ మాజీ ఎంపీ పరిమళ్ నత్వాని
అన్‌ఎక్స్‌పెక్టెడ్..: తనయుడిని దింపిన వైసీపీ మాజీ ఎంపీ పరిమళ్ నత్వాని

ఫామ్-6లో ఏకపక్షంగా చేసిన ఈ మార్పులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిబంధనను సవరించకుండా ఫామ్ స్వరూపాన్ని మార్చడం చట్టరిత్యా చెల్లదని వారు వాదించారు. ముఖ్యంగా సంధూ ఈ నిర్ణయాన్ని అనధికారిక చర్యగా అభివర్ణించారు. దీన్ని తొలగించాలని కోరారు. గత 10 నెలల్లో పూర్తి స్థాయి ఎన్నికల సంఘం నివేదికలు, అనుమతి లేకుండా తీసుకున్న కనీసం 14 నిర్ణయాలపై రాతపూర్వకంగా తమ నిరసనను వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

పసిడి ధరల్లో పురోగమనం
పసిడి ధరల్లో పురోగమనం

ఈ విభేదాల నేపథ్యంలో సమాలోచనలు జరిపిన ఎన్నికల సంఘం చివరికి సయోధ్యకు వచ్చింది. ఈ అదనపు నిబంధనను ఉపసంహరించుకుంటూ ఈసీ అధికారిక వివరణ ఇచ్చింది. తాము అసలు ఫారమ్-6ను సవరించలేదని, ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ కోసమే ఈ అదనపు డిక్లరేషన్‌ను తాత్కాలికంగా ప్రవేశపెట్టామని స్పష్టం చేసింది. గతంలో బీహార్‌లో జరిగిన ఎస్ఐఆర్ సమయంలో ఇలాంటి ప్రత్యేక అదనపు ప్రక్రియలను సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని కమిషన్ గుర్తుచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+