డీఎస్సీ వివాదం పై వైసీపీ అనూహ్య నిర్ణయం, ఇక..!!

కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిరసనలు కొనసాగిస్తున్నారు. కొందరు డీఎస్సీ అభ్యర్ధులు మాజీ సీఎం జగన్ ను కలిసారు. న్యాయ పరంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. పార్టీ నుంచి డీఎస్సీ పోరాట కమిటీని నియమించారు. తాజాగా ఈ కమిటీ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎస్సీ అక్రమాల పై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసారు.

డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ వ్యవహారం పైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారంలో జరిగిన అవకతవకలపై విస్తృతంగా చర్చించారు. డీఎస్సీ కారణంగా నష్టపోయిన అభ్యర్థుల తరఫున న్యాయపోరాటాన్ని కొనసాగించడంతో పాటు, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. బాధిత అభ్యర్థుల తో త్వరలోనే మరో సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. డీఎస్సీ-2025లో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు.

నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ.? కీలక శాఖల మార్పులు- ఎవరికి ఏది..!!
నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ.? కీలక శాఖల మార్పులు- ఎవరికి ఏది..!!
ysrcp-key-decision-over-dsc-irregularities-in-the-party-meeting-sajjala-made-crucial-comments

డీఎస్సీ అభ్యర్దులతో సమావేశానికి నిర్ణయం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి మించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎస్‌సీఈఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ కృష్ణా జిల్లా టాపర్‌గా నిలవడం, అత్యధిక మార్కులు సాధించినప్పటికీ ఉద్యోగం పొందకపోవడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఫలితాలపై 30 వేలకుపైగా గ్రీవెన్సులు వచ్చినప్పటికీ అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, వారిపై తప్పుడు ప్రచారం చేయడం వంటి చర్యలకు కొందరు ఉన్నతాధికారులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే డీఎస్సీ అంశంపై పలు రిట్ పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ-2025లో వెలుగులోకి వచ్చిన ప్రతి అంశంపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి, సీబీఐ విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డీఎస్సీ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+