CBSE: ఇక బోర్డు సొంత సర్వర్లలోనే, వెండర్ సర్వర్లకు  భారీ షాక్!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా జరిగిన పరీక్షల ఫలితాల రీ-వాల్యుయేషన్ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పరీక్షల డేటా భద్రతను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో, ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) రికార్డులను , మొత్తం సమాచారాన్ని వెండర్ సర్వర్ల నుంచి సీబీఎస్‌ఈ నియంత్రణలో ఉన్న సొంత సర్వర్లకు బదిలీ చేసింది. ఈ ప్రక్రియ కోసం COEMPT ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సేవలను బోర్డు కొనసాగిస్తున్నప్పటికీ, డేటా హోస్టింగ్ బాధ్యతలను మాత్రం ఇకపై బోర్డు స్వయంగా పర్యవేక్షించనుందని ఐఐటీ (IIT) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భద్రతా లోపాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ పటిష్ట చర్యలు చేపట్టారు.

రీ-వాల్యుయేషన్ పోర్టల్‌ను మరింత పటిష్టం చేసేందుకు సీబీఎస్‌ఈ గతంలోనే ఐఐటీ కాన్పూర్ , ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందాలను రంగంలోకి దించింది. ఐఐటీ కాన్పూర్ సైబర్ భద్రతా విభాగం దాదాపు పది రోజులకు పైగా శ్రమించి, బోర్డు రిజిస్ట్రేషన్ , OSM రీ-ఎవాల్యుయేషన్ పోర్టళ్లను క్షుణ్ణంగా పరిశీలించింది. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) కోడ్ మెరుగుదల ప్రక్రియకు నాయకత్వం వహించగా, ఐఐటీ కాన్పూర్ 'రెడ్ టీమ్'గా వ్యవహరించి వ్యవస్థలోని లోపాలను గుర్తించేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా 'బ్లూ టీమ్' కోడింగ్‌ను మరింత శక్తివంతం చేయగా, 'రెడ్ టీమ్' వ్యవస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఎక్కడా ఎలాంటి లూప్‌హోల్స్ లేకుండా సరిదిద్దింది. ఈ పరివర్తన సమయంలో COEMPT అధికారులు కూడా డేటా మైగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడంలో సహకరించారు.

CBSE Partners With IIT Teams To Review OSM Code And Take Full Control Of Student Examination Records

38 లక్షల ప్యాకెట్లతో సైబర్ దాడి.. తిప్పికొట్టిన బోర్డు!

ఇటీవల తన రీ-వాల్యుయేషన్ ప్లాట్‌ఫామ్‌పై జరిగిన ఒక భారీ సైబర్ దాడిని కూడా సీబీఎస్‌ఈ ధృవీకరించింది. జూన్ 3న దాదాపు 3.8 మిలియన్ (38 లక్షల) ప్యాకెట్లతో జరిగిన డినైల్-ఆఫ్-సర్వీస్ (DoS) దాడిని బోర్డు సాంకేతిక బృందం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనివల్ల విద్యార్థుల వెరిఫికేషన్ , ఇతర సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఎథికల్ హ్యాకర్ నిసర్గ గుర్తించిన కొన్ని భద్రతా లోపాలపై స్పందిస్తూ.. ఇప్పటి వరకు సిస్టమ్‌లో ఎలాంటి డేటా ఉల్లంఘనలు (డేటా లీక్) జరిగినట్లు ఆధారాలు లేవని ఐఐటీ అధికారి స్పష్టం చేశారు.

CBSE విద్యార్థులకు బిగ్ అలర్ట్! దరఖాస్తు గడువు పొడిగింపు
CBSE విద్యార్థులకు బిగ్ అలర్ట్! దరఖాస్తు గడువు పొడిగింపు

లక్షా 10 వేల దరఖాస్తులు.. ఆందోళన అవసరం లేదు!

జూన్ 4 నాటికి, బోర్డు గ్రీవెన్స్ పరిష్కార యంత్రాంగం ద్వారా మొత్తం 70,433 దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో మార్కుల వెరిఫికేషన్ కోసం 7,314 అభ్యర్థనలు, రీ-ఎవాల్యుయేషన్ కోసం 63,119 అభ్యర్థనలు వచ్చాయి. ఇక COEMPT ప్లాట్‌ఫారమ్ విశ్వసనీయతపై వస్తున్న అనుమానాలపై సదరు అధికారి క్లారిటీ ఇచ్చారు.

CBSE గుట్టు విప్పిన క్లాడ్ ఏఐ! పోర్టల్‌లో తీవ్ర భద్రతా లోపాలు?
CBSE గుట్టు విప్పిన క్లాడ్ ఏఐ! పోర్టల్‌లో తీవ్ర భద్రతా లోపాలు?

గతంలో ఆ సంస్థ 40 కోట్ల పేజీలను స్కాన్ చేయగా, కేవలం 30,000 పేజీల్లో (అంటే ప్రతి 10,000 పేజీల్లో ఒక్కటి మాత్రమే) లోపాలు తలెత్తాయని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని పూర్తి చేయగలరని, వెండర్ సర్వర్లపై పూర్తిగా ఆధారపడకుండా బోర్డు సొంత మౌలిక సదుపాయాలపైనే వ్యవస్థను నడుపుతున్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+