కాంగ్రెస్, వైఎస్ఆర్ వేరు వేరు కాదు: మంత్రి రఘువీరా రెడ్డి
Districts
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రెండు వేరు వేరు కాదని మంత్రి రఘువీరారెడ్డి ఆదివారం అనంతపుర్ జిల్లాలో అన్నారు. శాసనమండలి ఎన్నికలలో భాగంగా అనంతపుర్‌లోని మడకశిరలో మంత్రి రఘువీరారెడ్డి ఓటు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దివంగత వైఎస్ఆర్‌ను ఎన్నడూ అవాయిడ్ చేయదన్నారు. కాంగ్రెస్సే, వైఎస్ అని, వైఎస్సే కాంగ్రెస్ అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు. ఆయన ఆశయాలు ఎప్పుడూ కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పథకాలకు మంచి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.